ETV Bharat / state

80 శాతం మొక్కలు బతక్కపోతే చట్టపరమైన చర్యలు: కేటీఆర్ - Minister KTR video conference with municipal chairmen's updates

ప్రజల విస్తృత భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో చురుగ్గా పాల్గొనాలని కోరిన ఆయన... ప్రతి పురపాలిక తన బడ్జెట్లో పదిశాతం పచ్చదనం కోసం విధిగా ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి పట్టణంలో నాటిన చెట్లన్నింటినీ సంరక్షించే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

minister-ktr-video-conference-with-municipal-chairmens-about-municipalities-development
80 శాతం మొక్కలు బతక్కపోతే చట్టపరమైన చర్యలు: కేటీఆర్
author img

By

Published : Jun 13, 2020, 4:58 PM IST

Updated : Jun 13, 2020, 6:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం ద్వారా అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని మున్సిపల్​ ఛైర్మన్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అన్ని మున్సిపాల్టీల ఛైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో కేటీఆర్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పురపాలికల నిర్వహణ, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రణాళికలపై దిశానిర్దేశం చేసిన మంత్రి... హరితహారం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పట్టణాలను హరితమయం చేయాలి...

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పురపాలకశాఖ అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ చురుగ్గా పాల్గొనాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. నూతన పురపాలక చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి మున్సిపాల్టీ బడ్జెట్​లో పదిశాతం హరిత బడ్జెట్​గా ఉండాలని చెప్పారు. ఆ నిధులతో పట్టణాలను హరితమయం చేయాలని సూచించారు.

85శాతం మెుక్కలు బతకాల్సిందే..

పట్టణాల్లో మెుక్కలను నాటడంతో పాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా పురపాలక శాఖ కమిషనర్, ఛైర్ పర్సన్​లదేనాని కేటీఆర్ స్పష్టం చేశారు. నాటిన మెుక్కలలో కనీసం 85శాతం బతకకపోతే చట్టప్రకారం చర్యలకు ఆస్కారం ఉంటుందని గుర్తుచేశారు. నాటిన చెట్లను కాపాడేందుకు, అవసరమైన నీటి సరఫరా వంటి ప్రణాళికలను ఇప్పటినుంచే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే...

ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి పట్టణంలో నాటిన చెట్లను సంరక్షించే కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. డంప్ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలన్న మంత్రి... పట్టణాల్లో సాధ్యమైనంత ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలను నాటడం ద్వారా సంరక్షణ సులువవుతుందని తెలిపారు. దోమలను తరిమే మస్కిటో రిప్పెలంట్ చెట్లను నాటాలని సూచించారు.

ప్రణాళికలు సిద్ధం చేయాలి....

ఖాళీస్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రతి పట్టణానికి ఒక ట్రీపార్క్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 పట్టణాలకు దగ్గరలో అటవీ బ్లాకులు అందుబాటులో ఉన్నాయని... వాటిలో చెట్లు నాటేందుకు పురపాలికలు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ బడ్జెట్ వినియోగంపై భవిష్యత్తులో సమగ్ర సమీక్ష ఉంటుందన్న కేటీఆర్... హరితహారం, గ్రీన్ బడ్జెట్ ప్రాధాన్యతను తక్కువచేసి చూసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.

నిరంతరం పర్యవేక్షణకు...

ప్రతి పట్టణంలో స్మృతివనాల ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలని అన్నారు. పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు పురపాలక సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, నిరంతరం సమీక్ష నిర్వహించాలని మంత్రి తెలిపారు. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో పారిశుద్ధ్యంతో పాటు అత్యవసరమైన ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్​ని కూడా చేపట్టామన్న మంత్రి... ఈ సీజన్​లో సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పురపాలికలు చేపడుతున్న కార్యక్రమాల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచాలని... అందులో భాగంగానే ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్రతి వారం పదినిమిషాల చొప్పున తమ సొంత కుటుంబాల కోసం సమయం కేటాయించుకుంటే, దోమల ద్వారా వచ్చే అనేక సీజనల్ వ్యాధులు ఎదుర్కోవచ్చని కేటీఆర్ అన్నారు. రేపటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్​ను అభినందించిన మంత్రి....

మురికి కాల్వలు, వాన నీటి కాల్వల పూడికతీత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని... నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగిన్ పాయింట్లు, మ్యాన్ హోల్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పట్టణప్రగతి నిర్వహణ తీరుపై పూర్తి వివరాలతో నివేదిక పంపిన ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావుతోపాటు మున్సిపల్ కమిషనర్​ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి... ప్రతి ఒక్క పట్టణం చేపట్టిన కార్యక్రమాలపై నివేదిక తయారు చేయాలని అన్నారు. పట్టణ ప్రగతికి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను ఫోటోలతో సహా నివేదిక తయారు చేస్తే కార్యక్రమాలు ప్రజలకు అర్థమవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

Last Updated : Jun 13, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.