KTRs tweet on BJP MPs have fake certificates: సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు క్రియాశీలకంగా ఉండే మంత్రి కేటీఆర్ ఈసారి మరో ట్వీట్‌తో నకిలీ ధ్రువపత్రాలపై చర్చకు తెరలేపారు. భారతీయ జనతా పార్టీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహా చాలా మంది ఉన్నట్లున్నారని కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలపై నకిలీ ధ్రువపత్రాల ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. వారి ఇరువురి దగ్గర రాజస్థాన్, తమిళనాడు విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని చెప్పారు. ఎంపీగా ఎన్నికైన అఫిడవిట్లో అబద్ధాలు చెప్పడం నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్‌సభ సభాపతి వాటిని పరిశీలించి తప్పు అని తేలితే అనర్హత వేటు వేస్తారా..! అని కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు.
-
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
— KTR (@KTRBRS) April 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…
">Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
— KTR (@KTRBRS) April 4, 2023
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
— KTR (@KTRBRS) April 4, 2023
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నకిలీ ధ్రువపత్రాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కోరిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు మార్చి 31వ తేదీన రూ.25వేలు జరిమానా విధించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మోదీ డిగ్రీపై కేజ్రీవాల్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు పక్కనబెట్టింది. కేజ్రీవాల్‌కు విధించిన జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం: 2016 ఏప్రిల్‌లో అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర సమాచార కమిషన్ ఛైర్మన్‌కు ఓ లేఖ రాశారు. అందులో ఆర్టీఐ చట్టం ప్రకారం మోదీ విద్యార్హతలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కేజ్రీవాల్ కోరారు. తన గురించి ప్రభుత్వ రికార్డులు వెల్లడించేందుకు ఏం అభ్యంతరం లేదన్న కేజ్రీవాల్.. మోదీ విద్యార్హతల సమాచారాన్ని కమిషన్ ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటోందని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన అప్పటి కేంద్ర సమాచార కమిషన్ ఛైర్మన్ ఎమ్ శ్రీధర్ ఆచార్యులు.. గుజరాత్ యూనివర్సిటీకి, దిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని సూచించారు. కేంద్ర సమాచార కమిషన్ ఛైర్మన్ ఎమ్ శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలపై.. గుజరాత్ యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలపై స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని పక్కనబెడుతూ.. కేజ్రీవాల్‌కు జరిమానా విధించింది.
ఇవీ చదవండి:
'ఎన్ఆర్సీ కంటే ముందు మోదీ డిగ్రీ పట్టా చూపించాలి'
మంత్రి కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్వీట్ వార్
ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.. కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్ల వార్