KTR Tweet on Youth Employment: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాస ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కోరారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటు రంగంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో మునుగోడు యువతకు ఉపాధి అందించే సంకల్పంతో.. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ దండు మల్కాపూర్‌లో 2019లోనే ప్రభుత్వం నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. సుమారు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధినందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోందన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతుందని కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.
-
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
— KTR (@KTRTRS) October 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
1/3 pic.twitter.com/lpRyHiLpeY
">ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
— KTR (@KTRTRS) October 24, 2022
1/3 pic.twitter.com/lpRyHiLpeYముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
— KTR (@KTRTRS) October 24, 2022
1/3 pic.twitter.com/lpRyHiLpeY
ఇవీ చదవండి: