ETV Bharat / state

ఆ నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది: కేటీఆర్

author img

By

Published : Jun 9, 2022, 3:38 PM IST

Ktr On Environment Index: పర్యావరణ నివేదికలో భారతదేశం అట్టడుగు స్థానంలో నిలవడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై అందరం తీవ్రంగా ఆలోచించి తగిన కార్యచరణ చేపట్టాల్సిన అవసరముందని ట్వీట్​ చేశారు.

Ktr On Environment Index:
కేటీఆర్

Ktr On Environment Index: పర్యావరణ పనితీరు నివేదికలో భారతదేశం 180వ స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దీనిపై తగిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. ఎన్విరాన్‌మెంటల్‌ ఫర్మామెన్స్ ఇండెక్స్-2022లో భారతదేశం కేవలం 18.9 స్కోరుతో 180వ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్‌ తరాలకు మనం నష్టం చేయరాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Jubileehills rape case: పోలీసుల కీలక నిర్ణయం.. కేటీఆర్ మద్దతు

'ఆలస్యం ఏం లేదు.. రెండు రోజుల్లో వానలే వానలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.