థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం.. దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
హైదరాబాద్ మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్వర్కింగ్ సమావేశానికి థాయ్‌లాండ్ ఉపప్రధాని జరీన్ లక్సనావిసిత్‌తో పాటు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
తెలంగాణలో ఆహార శుద్ధి రంగంలో అపార అవకాశాలున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఫర్నీచర్ పార్క్ ఏర్పాటు చేయాలని థాయ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్- బ్యాంకాక్‌ల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులున్నాయని, పర్యాటకంగా ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందొచ్చని సూచించారు.
- ఇదీ చూడండి : కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్