ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద మహాప్రస్థానం లాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన చెరువుల అభివృద్ది, సుందరీకరణ పనులు మరింత వేగవంతం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలను మంత్రి కోరారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్షించారు. ఈ ఏడాది సుమారు 75 వేల ఇళ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్నింటికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యేలకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా