KTR speech at Bio Asia Conference 2023: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 20వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఇందులో మంత్రి కేటీఆర్, నీతిఆయోగ్ సభ్యులు వీకే పాల్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు యూకే భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ ఇతివృత్తంతంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
Bio Asia Conference 2023 In Telangana: లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని.. ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని తెలిపారు. ఈ రంగంలో హైదరాబాద్‌కు 7ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని.. 800కుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయని వివరించారు.
Bio Asia Conference at HICC in Hyderabad: టాప్ -10 ఫార్మా కంపెనీల్లో 4 తెలంగాణ నుంచే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్ తెలిపారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో పలు అంకురాలు పాల్గొని తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నాయి. సదస్సులో పాల్గొనేందుకు 400లకు పైగా అంకురాలు పోటీపడగా 75 సంస్థలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిలో తుది జాబితాకు 5 సంస్థలు ఎంపికయ్యాయి.
'లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే పెద్ద నగరం. లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా హైదరాబాద్ అవతరించింది. రాష్ట్రంలో 800కుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలున్నాయి. మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి రాష్ట్రం నుంచే, దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం రాష్ట్రం నుంచే.. ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే.. టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు రాష్ట్రంలో ఉన్నాయి. హైదరాబాద్‌లో 20కిపైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'. -కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి
ఇవీ చదవండి: