గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో మరణ ధ్రువవపత్రాల జారీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉండరాదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరణధృవపత్రాలు జారీలో ఫిర్యాదులపై స్పందించిన మంత్రి కేటీఆర్... అధికారులతో సమీక్షించారు. మరణ ధృవపత్రాల జారీలో ఆలస్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.
శ్మశాన వాటికల్లోని రికార్డుల్లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయకపోవడం వల్ల మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం అవుతుందని జీహెచ్ఎంసీ ఇచ్చే రికార్డులు అన్ని శ్మశాన వాటికల్లో విధిగా ఉండేలా చూడాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఆయా కమిటీల యాజమాన్యాలను సంప్రదించి రికార్డులు ముందస్తుగానే అందించే ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష