పెట్రోల్, డీజిల్ పెంపును నిరసిస్తూ... వాటిలో భాగంగా సిలీండర్లు, ద్విచక్రవాహనాలు చెరువుల్లో పడేయటంపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది. ఈ అంశంపై నిరసనలు చేస్తూ... కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారని... వారు చేసిన చర్యలు పూర్తిగా ఖండించదగినవని అన్నారు.
''జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్లో తాము ప్రయాణించిన బైక్‌ను విసిరేసి అత్యుత్సాహం చూపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Youth Congress : ట్యాంక్‌బండ్‌లో బైక్ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
గ్యాస్ ధర 25 రూపాయల పెంపు వ్యతిరేకిస్తూ.. నిరసనలో భాగంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ కార్యకర్తలు సిలిండర్‌ను హుస్సేన్ సాగర్ నీటిలో వేశారు.''
ఈ రెండు ఘటనలపై స్పందించిన కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ''ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు అనేవి ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనవి. కానీ చెరువుల్లో సిలీండర్లు, బైక్‌లు పడేయటమనేది పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమ్మూద్ అలీ, తెలంగాణ డీజీపీని కోరుతున్నట్లు'' ట్వీట్ చేశారు.
-
Protest is an important part of democracy to attract the attention of Govts & people
— KTR (@KTRTRS) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
But irresponsible behaviour such as these👇, throwing bikes & cylinders into lakes is reprehensible
Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to issue instructions for stern action pic.twitter.com/TRTSGAWQLr
">Protest is an important part of democracy to attract the attention of Govts & people
— KTR (@KTRTRS) July 6, 2021
But irresponsible behaviour such as these👇, throwing bikes & cylinders into lakes is reprehensible
Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to issue instructions for stern action pic.twitter.com/TRTSGAWQLrProtest is an important part of democracy to attract the attention of Govts & people
— KTR (@KTRTRS) July 6, 2021
But irresponsible behaviour such as these👇, throwing bikes & cylinders into lakes is reprehensible
Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to issue instructions for stern action pic.twitter.com/TRTSGAWQLr
ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం అవుతున్నాయి. బంగారం రేటు పెరిగితే ఇలానే పడేస్తారా అంటూ చమత్కరిస్తున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది. వంట గ్యాస్ ధర రూ.25.50 పెరిగింది. దీనితో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 834.50కి చేరింది. 19కేజీల సిలిండర్‌పై రూ. 76 పెరిగి రూ. 1,550కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.10 తగ్గించాయి.
ఇదీ చూడండి: ఐదేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. ఆపై