ETV Bharat / state

'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'

తెరాస చేసిన అభివృద్ధిపై ఇంటింటికీ ప్రచారం చేయాలి: కేటీఆర్‌

author img

By

Published : Nov 20, 2020, 5:26 PM IST

Updated : Nov 20, 2020, 7:00 PM IST

17:23 November 20

'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'

తెరాస చేసిన అభివృద్ధిపై ఇంటింటికీ ప్రచారం చేయాలి: కేటీఆర్‌

హైదరాబాద్ అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ప్రగతి నివేదిక విడుదల చేశారు. 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం చట్టం తెచ్చారని మంత్రి వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లు మహిళలకే కేటాయించినట్లు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.  

తెరాసదే ఘనత...

ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత తెరాసకే దక్కుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. గులాబీ సైనికులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్కో కార్యకర్త 50 వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని... వందల మంది కష్టపడితే ఒక్క నాయకుడు వస్తాడని కేటీఆర్‌ అన్నారు.  

ఇంటింటికీ ప్రచారం...

టికెట్లు రాని కార్యకర్తలను అభ్యర్థులు కలుపుకుని పోవాలని మంత్రి సూచించారు. విజయగర్వం లేకుండా అందరూ అణకువగా ఉండాలన్నారు. తెరాస అభ్యర్థులు బీ ఫామ్‌ సమర్పించాక జనంలోకి వెళ్లాలని తెలిపారు. తెరాస చేసిన అభివృద్ధిపై ఇంటింటికీ ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. హైదరాబాద్‌లో ఏం పనులు చేశామో అందరికీ తెలియచేయాలన్నారు.

మంచినీటి సమస్య పరిష్కరించాం...

 మంచినీటి సమస్యను 95 శాతం వరకు పరిష్కరించామని వెల్లడించారు. 1920లో గండిపేట రిజర్వాయర్‌ నిర్మాణం జరిగిందన్నారు.  పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదన్నారు. హైదరాబాద్‌లో కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 6 నెలల్లో కేశవాపురం రిజర్వాయర్‌ నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. 2050 వరకు తాగునీటికి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  

ఆర్థిక ఇంజిన్ హైదరాబాద్...

నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ తెరాస హయాంలోనే వచ్చిందన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో పేకాట, గుడుంబా క్లబ్బులు మూతపడ్డాయన్న కేటీఆర్... రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌ అని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుందన్నారు.

ఎలాంటి హైదరాబాద్ కావాలి?

అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా? నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్‌ కావాలా?: అని మంత్రి అడిగారు. తెరాస ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన పనులు వంద చెప్పవచ్చని... కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన ఒక్క పని చూపెడతారా? ప్రశ్నించారు. ఆరేళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్తున్నామని మరోమారు స్పష్టం చేశారు. అభివృద్ధి హైదరాబాదా? లేక అశాంతి హైదరాబాదా? ప్రజలు తేల్చుకోవాలన్నారు.  

వరద బాధితులను ఆదుకున్నాం...

హైదరాబాద్‌లో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్‌ అన్నారు. ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్లు సాయం అందించామని... రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం లేఖ రాశారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కేంద్ర సాయం అందలేదని ఆరోపించారు. ఇంటింటికీ వెళ్లి తెరాస చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడగండని కార్యకర్తలకు సూచించారు. తెరాస ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపలేదన్నారు. పేదల పక్షపాతిగా ఉన్నామే తప్ప నడ్డివిరిచే పనులు చేయలేదని పేర్కొన్నారు.

సభకు సమాయత్తంకండి...

హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి చేస్తారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేసిందో కార్యకర్తలు వివరించాలని సూచించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలు తెలపాలన్నారు. ఎస్‌ఆర్‌డీపీ మాదిరిగా ఎన్‌ఎన్‌డీపీ చేపడతామని ప్రకటించారు. ప్రతి వర్గం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలన్నారు. ఈనెల 28న సభకు కార్యకర్తలు సమాయత్తం కావాలని మంత్రి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని కేటీఆర్‌ అన్నారు.

ఇదీ చూడండి: ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

Last Updated : Nov 20, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.