-
Speaking at the event, Minister @KTRTRS said, We welcome @GoIvanti, which is among the largest Cybersecurity companies in the world, to join the list of marquee companies which have presence in Telangana. pic.twitter.com/xCBNMjxbK0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Speaking at the event, Minister @KTRTRS said, We welcome @GoIvanti, which is among the largest Cybersecurity companies in the world, to join the list of marquee companies which have presence in Telangana. pic.twitter.com/xCBNMjxbK0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 21, 2021Speaking at the event, Minister @KTRTRS said, We welcome @GoIvanti, which is among the largest Cybersecurity companies in the world, to join the list of marquee companies which have presence in Telangana. pic.twitter.com/xCBNMjxbK0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 21, 2021
యూఎస్‌కు చెందిన ప్రముఖ ఐటీ, సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇవాంటి (KTR On Ivanti) హైదరాబాద్‌లో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ (KTR On Ivanti) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సాంకేతికత సాయంతో మనం నేరుగా ఉపకరణలతో అనుసంధానం కాగలుగుతున్నా.. వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు సైబర్ భద్రత ఈరోజుల్లో పెనుసవాల్‌గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇవాంటి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా 200 మిలియన్‌కు పైగా ఉపకరణాలు సైబర్, హాకర్స్ నుంచి రక్షించబడటం గొప్ప విషయమని కేటీఆర్ (KTR On Ivanti) కొనియాడారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి పనిచేసి దేశానికే ఆదర్శమైన పాలసీని రూపొందిస్తామని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో తమ కంపెనీ ఒక ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటుతో పాటు, ఉద్యోగులను 2వేలకు పెంచనున్నట్లు తెలిపిన కంపెనీ ప్రకటనను కేటీఆర్ స్వాగతించారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్‌లో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కేటీఆర్ అన్నారు.
నేరం అనేది తన ఆకృతిని మార్చుకుంది. సైబర్ క్రైమ్ అనేది చాలా ప్రమాదకరం. ఇవాంటి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా 200 మిలియన్లకు పైగా ఉపకరణాలు సైబర్ దాడుల నుంచి రక్షించడం గొప్ప విషయం. చాలా ఏళ్ల క్రితమే మేం సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్‌లో ఇవాంటి విస్తరించేందుకు అవసరమైన సహకారాన్ని మా తరఫున అందిస్తాం.
-- కేటీఆర్, మంత్రి
ఇదీ చూడండి: Telangana Vijaya Garjana: 'తెలంగాణ విజయగర్జన సభను దిగ్విజయం చేద్దాం'