KTR at Mahindra University: ఎన్నో కొత్త ఆవిష్కరణలతో యువత ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా 27 ఏళ్ల కన్న చిన్నవారేనని తెలిపారు. మీరు తల్చుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయం మెుదటి స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రోజు రోజుకు డిజిటలైజ్ అవుతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని తమ విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని టెక్ మహీంద్రా ముఖ్య కార్య నిర్వాహణ అధికారి సీపీ గుర్నాని అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తును ఎదుర్కొనేలా విద్యార్థులను తయారు చేస్తున్నామన్నారు. తమ విశ్వవిద్యాలయంలో చదివిన పిల్లలు అంకుర సంస్థలు పెడుతున్నారంటే ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్ల పాల్గొన్నారు.
ఇవీ చదవండి: గెదేను కాపాడబోయి ఒకరు గల్లంతు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు
'వారి లూటీపై మాట్లాడినందుకే ఈ ఆరోపణలు- రాహుల్.. దమ్ముంటే ఆ పని చెయ్'