ETV Bharat / state

TSPSCకి ఏ శాఖతోనూ సంబంధం ఉండదు: కేటీఆర్‌ - pedda ambarpet brs public meeting

tspsc paper leak issue టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పందించారు. పెద్దఅంబర్‌ పేటలో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో పాల్గొన్న మంత్రి... టీఎస్‌పీఎస్‌సీ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని వెల్లడించారు.

KTR
KTR
author img

By

Published : Mar 25, 2023, 6:44 PM IST

Updated : Mar 25, 2023, 7:40 PM IST

TSPSCకి ఏ శాఖతోనూ సంబంధం ఉండదు: కేటీఆర్‌

Minister Ktr in brs public meeting ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దఅంబర్‌ పేటలో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నిర్వహించారు. 63 రోజుల పాటు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు పాదయాత్ర చేశారు. 95 గ్రామాల మీదుగా 775 కి.మీ. మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర చేయగా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ప్రధానంగా 10 సమస్యలను ప్రశాంత్‌రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్న కేటీఆర్.. స్వచ్ఛ గ్రామాలు, ఉత్తమ మున్సిపాలిటీ కేటగిరీల్లో రాష్ట్రానికే అధిక అవార్డులు వచ్చాయన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.10 లక్షలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ ఏర్పాటు కానుందని వెల్లడించారు. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మరోసారి తెలిపారు. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని అపోహలు సృష్టించారని.. ఇప్పుడు హైదరాబాద్‌, పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లో భూములు ధరలు పెరిగాయని స్పష్టం చేశారు.

గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3 వేల మందికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. జన్‌ ధన్‌ ఖాతాల్లో మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ పోయాయి. ఏటా రూ.2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్న మోదీ హామీ ఏమైంది. ఈ 9 ఏళ్లల్లో ఎంతమందికి మోదీ ఉద్యోగాలు కల్పించారు. - మంత్రి కేటీఆర్

Minister Ktr on tspsc paper leak issue ఇక ఇదిలా ఉంటే ఈ బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ ... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి ఈ పేపర్ లీకేజీ విషయంపై రియాక్ట్ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీకి ఏ శాఖతోనూ సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని వెల్లడించారు.

ఇవీ చూడండి:

Last Updated : Mar 25, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.