పెట్టుబడులే లక్ష్యంగా ముంబయిలో పర్యటిస్తోన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫార్మాస్యూటికల్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. భారత ఫార్మాస్యూటికల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో పాల్గొన్న కేటీఆర్... రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రానికున్న దార్శనికతను ఇండస్ట్రీ నిపుణులకు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఫార్మా రంగ రూ.3 లక్షల 55 వేల కోట్ల సామర్థ్యం ఉన్న లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంను 2030 వరకు రెట్టింపు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్?