MINISTER KTR: ఆధునిక ఆటో మొబైల్ రంగంలో హైదరాబాద్కు అపార అవకాశాలు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ కోకాపేటలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ సెంటర్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ.. హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ సందర్భంగా భాగ్యనగరంలో వ్యాపారానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
''హైదరాబాద్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో 'ఫార్ములా ఈ'ని ప్రారంభించబోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.'' - కె.టి.రామారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆర్థికంగా మరింత పరిపుష్ఠం అవుతోందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ.. జీడీపీలో 5 శాతం వాటా అందిస్తోందని తెలిపారు. గతేడాది అక్టోబర్లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ దేశ జీడీపీలో 5 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశానికి రెండింతల ప్రభావం చూపగల పరిపాలన అవసరమన్న కేటీఆర్.. పనికిమాలిన డబుల్ ఇంజిన్లు అక్కర్లేదని ఎద్దేవా చేశారు.
-
Telangana with 2.5% of Indian population contributes 5.0% to India’s GDP (Source: RBI report, October 2021)
— KTR (@KTRTRS) June 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
What the country needs is “Double Impact” governance, Not futile Double Engines
">Telangana with 2.5% of Indian population contributes 5.0% to India’s GDP (Source: RBI report, October 2021)
— KTR (@KTRTRS) June 13, 2022
What the country needs is “Double Impact” governance, Not futile Double EnginesTelangana with 2.5% of Indian population contributes 5.0% to India’s GDP (Source: RBI report, October 2021)
— KTR (@KTRTRS) June 13, 2022
What the country needs is “Double Impact” governance, Not futile Double Engines
ఇదీ చూడండి..
KTR Tweet Today : భాజపా నేతలంతా సత్య హరిశ్చంద్రులా..?
ప్రియుడి కోసం భర్త హత్యకు భార్య సుపారీ.. వారి పేరు చెప్పి డ్రామా.. చివరకు..