ETV Bharat / state

KTR Tweet Today: అదానీ కంపెనీని.. ఆదుకోవడమే మోదీ ఏకైక లక్ష్యం - మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR Tweet Today: దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల దృష్ట్యా సామాన్యుడికి రోజు రోజుకు బతుకు భారంగా మారుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆగ మేఘాల మీద అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యమని దేశం కోసం కాదని.. దోస్తు కోసం అంటూ ప్రధాని మోదీని మంత్రి ప్రశ్నించారు. ట్విటర్‌లో ఒక యూజర్‌ పోస్ట్‌ చేసిన వీడియోను కోట్‌ చేస్తూ.. కేటీఆర్ ట్విటర్‌లో రిపోస్ట్‌ చేశారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు, నియంత్రించేది లేదని ధ్వజమెత్తారు.

Minister KTR Tweet Today
Minister KTR Tweet Today
author img

By

Published : Apr 23, 2023, 6:50 PM IST

Minister KTR Tweet Today: ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్​లో యాక్టివ్​గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే చాలు వాటిని వెంటనే పోస్ట్​ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అయితే ట్విటర్​లో యమా యాక్టివ్. కేంద్రంపై విమర్శలు, ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ట్విటర్​ను వేదిక చేసుకుంటారు.

సామాన్యుడికి రోజు రోజుకు బతుకు భారంగా మారుతోంది: తాజాగా 'మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా సామాన్యుడికి రోజు రోజుకు బతుకు భారంగా మారుతోందని మంత్రి ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ట్విటర్‌లో ఒక యూజర్‌ పోస్ట్‌ చేసిన వీడియోను కోట్‌ చేస్తూ.. కేటీఆర్ రిపోస్ట్‌ చేశారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు, నియంత్రించేది లేదని ధ్వజమెత్తారు.

  • ఇది తెలంగాణ సామాన్యుడి గళం…
    “సామాన్య శాస్త్రం”

    # ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు
    # ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు
    # గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు

    కానీ…

    # ఆగమేఘాల మీద అదానీ కంపెనీని
    ఆదుకోవడమే మీ ఏకైక… pic.twitter.com/ZezkY72WPv

    — KTR (@KTRBRS) April 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet About Kanti Velugu: ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలని లేదు, గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు అంటూ ట్వీట్‌ చేశారు. ఆగ మేఘాల మీద అదానీ కంపెనీని.. ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం.. దేశం కోసం కాదు.. దోస్తు కోసం అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం మేక్‌ ఇన్‌ తెలంగాణ అన్న నినాదానికి నిజమైన ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.

  • A truly successful example of #MakeInTelangana 👍

    “Kanti Velugu” initiative - the largest eye screening program of #KCR Government has helped Crores or poor people in Telangana

    Akriti Eye Care, based out of Telangana Medical Devices Park at Sultanpur has delivered 25 lakh… pic.twitter.com/Ygi1Bs2jA7

KTR Fire on PM Modi on Twitter Platform: సుల్తాన్‌పూర్‌లోని తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్‌లోని అకృతి ఐ కేర్, కంటి వెలుగు కార్యక్రమానికి రూ.25 లక్షల అద్దాలను పంపిణీ చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. రూ.85 వేల ఖర్చుతో కూడిన కంటి ఇంప్లాంట్​కు.. కంటి కవచాలకు రూ.8 లక్షలు, రీడింగ్ గ్లాసెస్‌కు 3.8 మిలియన్లు, కంటి ఫ్రేమ్‌లకు 14 మిలియన్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేవలం కంటి వెలుగు కోసం మాత్రమే కాకుండా ఆకృతి సంస్థ ఇప్పటికే 15 దేశాలకు ఎగుమతి చెస్తున్నట్లు వెల్లడించారు.

జూన్ 15 నాటికి వంద శాతం పూర్తి: ఈ సంవత్సరం జనవరిలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మం వేదికగా కంటి వెలుగు రెండో దశ ప్రారంభమైన విషయం విదితమే. జూన్ 15 నాటికి వంద శాతం మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.