ETV Bharat / state

Ktr on Vijaya Garjna: 'విజయగర్జనను మరిచిపోలేని విధంగా నిర్వహిద్దాం'

తెరాస నిర్వహించతలపెట్టిన విజయగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr on Vijaya Garjana) శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ భవన్​లో వివిధ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు.

Ktr
విజయ గర్జన
author img

By

Published : Oct 20, 2021, 7:48 PM IST

తెలంగాణ విజయ గర్జన(Telangana Vijayagarjana)ను మరిచిపోలేని విధంగా నిర్వహించాలని పార్టీ నేతలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr on Vijaya Garjana) తెలిపారు. విజయగర్జన సభ సన్నాహకాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్​లో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, ఎల్​బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, అశ్వరావు పేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.

  • ఇవాళ మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్, కూకట్ పల్లి, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, పాలేరు, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులతో స‌మావేశ‌మై దిశానిర్దేశం చేశారు. pic.twitter.com/Nk0RoUG6dn

    — TRS Party (@trspartyonline) October 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నేతలకు కేటీఆర్ తెలిపారు. ఒకరిపై ఒకరు నెపం మోపవద్దని... అందరూ ఎవరిస్థాయి వారు ప్రజలను సభకు సమీకరించాలని చెప్పారు. తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ సహకర సొసైటీల ఛైర్మన్లు నామినేషన్ దాఖలు చేశారు.

రెండు దశాబ్దాల తెరాస (TRS) ప్రస్థానం, ఏడేళ్ల జనరంజకమైన పాలన, రాష్ట్రం సాధించిన చిరస్మరణీయమైన విజయాలను తెలియజేస్తూ నవంబరు 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట భారీ బహిరంగసభను జరుపుతామని కేటీఆర్ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు గ్రామ, మండల, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ముమ్మరం..

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌లో నిర్వహించే... విజయ గర్జన సభ విజయవంతంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (Ktr on Vijaya Garjna) కసరత్తు ముమ్మరంచేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) దిశానిర్దేశం మేరకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ నియోజకవర్గాల వారిగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు... అన్ని నియోజకవర్గాల్లోని నేతలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. స్థానికంగా చిన్న చిన్న సమస్యలు, సమన్వయ లోపాలుంటే పక్కన పెట్టి పనిచేయాలని ఇప్పటికే కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని సమస్యలపై తనతో చర్చించవచ్చన్న కేటీఆర్‌... రెండున్నరేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే విషయాన్ని.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీ చూడండి: KTR: నవంబరు 15న తెరాస విజయగర్జన: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.