ETV Bharat / state

బుడ్డోడి ఫీట్లకు కేటీఆర్ ఫిదా.. ట్విట్టర్​లో​ అభినందనలు

author img

By

Published : Jan 24, 2021, 3:02 PM IST

ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఔరా అనిపించేలా ఫీట్లు చేస్తున్నాడు. ఆ వీడియో ట్విట్టర్​లో చక్కర్లు కొడుతోంది. ఆ బాలుడి అద్భుత ఫీట్లకు మనమే కాదు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్​ కూడా ఫిదా అయ్యారు. ఫ్యూచర్​ ఒలింపిక్​ మెడలిస్ట్​ అంటూ కితాబిచ్చారు. అలాగే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తరుణ్​జోషీకి అభినందనలు తెలిపారు.

minister ktr, boy adventures in twitter
మంత్రి కేటీఆర్​, సాహసవీరులు, ట్విట్టర్​లో కేటీఆర్​ ప్రశంసలు

'ఆదివారం ఉత్సాహం కలిగించిన వీడియో' అంటూ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా పంచుకున్న వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఆ వీడియోలో అద్భుతమైన ఫీట్లు చేస్తుండటం విశేషం. ఈ వీడియోని కోట్ చేసిన కేటీఆర్.. 'భవిష్యత్తులో ఒలింపిక్ మెడలిస్ట్' అంటూ కితాబిచ్చారు. ఆ బాలుడు ఏ ప్రాంతానికి చెందినవాడో వివరాలు ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా లేక ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా తగిన సహాయం అందించాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

  • Wow 🤩 an Olympic medalist in the making

    Is he from Telangana or elsewhere in India? Would love to support this amazing talent https://t.co/tCeatdjxEB

    — KTR (@KTRTRS) January 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక కేటీఆర్​ చేసిన మరో ట్వీట్​లో.. ఇటీవల దిగ్విజయంగా కిలీమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ అధికారి తరుణ్​జోషీని అభినందించారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.. కిలిమాంజారోను ఈ నెల 21న హైదరాబాద్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ సంయుక్త సీపీ తరుణ్ జోషీ దిగ్విజయంగా అధిరోహించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.