ETV Bharat / state

కర్మ ఈజ్ బూమరాంగ్ అంటూ మోదీపై కేటీఆర్ సెటైర్‌

KTR on Bilkis Bano Case ప్రధాని మోదీపై తనదైన శైలీలో మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా సెటైర్స్ వేశారు. సాధారణంగా రాజకీయ పార్టీలు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై హామీలు ఇవ్వడం చూశాం, ఇప్పుడు మహిళలు, చిన్నారులను చంపిన దోషులను విడుదల చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు వదిలారు. కర్మ ఈజ్ బూమరాంగ్ అంటూ ట్వీటారు.

KTR on Bilkis Bano Case
కర్మ ఈజ్ బూమరాంగ్ అంటూ మోదీపై కేటీఆర్ సెటైర్‌
author img

By

Published : Aug 19, 2022, 4:36 PM IST

Updated : Aug 19, 2022, 7:39 PM IST

KTR on Bilkis Bano Case: బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో మంత్రి కేటీఆర్​ నిప్పులు చెరుగుతున్నారు. 11 మంది నిందితులను గుజరాత్​ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్​.. ఇప్పుడు మరోసారి స్పందించారు. స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్​ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​తో పాటు పలువురిని నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. బిల్కిస్‌బానో నిందితుల విడుదలపై ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై హామీలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు మహిళలు, చిన్నారులను చంపిన దోషులను విడుదల చేస్తున్నారని సెటైర్ వేశారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేనిదని ట్విటర్‌ వేదికగా తెలిపారు. 'కర్మ ఈజ్ బూమరాంగ్' అంటూ ట్వీటారు. కేటీఆర్‌ ట్వీట్‌కు నెటిజన్స్‌ నుంచి మద్దతు లభించింది. కొంత మంది సూపర్ సార్ అంటూ కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

  • Political parties typically promise development, security, welfare sops to win elections

    Now they are releasing Rapists & killers of pregnant women & children!!

    These acts of omission, commission & remission will Not be forgotten

    Karma is a Boomerang #BilkisBano

    — KTR (@KTRTRS) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిల్కిస్‌బానో నిందితుల విడుదల అప్పటి నుంచి మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులకు పూల మాలలు వేసి యుద్ధ వీరుల్లా సత్కరించటం మన దేశంలోనే చెల్లుతుందని నిర్వేదం వ్యక్తం చేశారు. కొందరి తీరుకిది నిదర్శనమనమంటూ ఫైర్ అయ్యారు. బిల్కిస్​కి జరిగిన ఘటన మనలో ఎవరికైనా జరగొచ్చని.. నిందితులకు పూల మాలలు వేయటంపై భారత్ గొంతెత్తి ప్రశ్నించాలని మంత్రి కేటీఆర్​ సూచించారు.

గుజరాత్‌లోని సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను రెమిసన్ కింద విడుదల ఇటీవల ఆగస్టు 15న విడుదల చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.

సీజేఐకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత : బిల్కిస్‌బానో అత్యాచార కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అత్యాచారం వంటి నేరాల్లో శిక్ష పడిన దోషులు స్వాతంత్ర్య దినోత్సవాన విడుదల కావడం ప్రజల వెన్నులో వణుకు పుడుతోందని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ కేసుల్లో దోషులకు శిక్ష తగ్గింపు లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్‌పీసీ చెబుతోందన్నారు. ఈ కేసులో దోషుల విడుదలకు గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందో లేదో తెలియదన్నారు. శిక్ష తగ్గింపులో ప్రభుత్వాలు ఏకపక్షంగా అధికారాలను ఉపయోగించవద్దని, వాస్తవిక దృష్టితో చూడాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందన్నారు. రేపిస్టులు బయటకు రావడాన్ని, పూలదండలతో వారికి స్వాగతం పలకడాన్ని చూసి బానో మనసు ముక్కలై ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టి, చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సీజేఐను కవిత కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 19, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.