ETV Bharat / state

విద్యారంగంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్ - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు

హైదరాబాద్ గోల్కొండ పరిధి తారామతి భారాదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థుల ఆవిష్కరణల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఉత్తమంగా నిలిచిన 5 ఆవిష్కరణలకు బహుమతుల ప్రదానం చేశారు.

minister-ktr-at-school-innovation-challenge-in-hyderabad
ప్రతి ప్రభుత్వ బడిలో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు: కేటీఆర్
author img

By

Published : Apr 4, 2022, 5:00 PM IST

Updated : Apr 4, 2022, 5:15 PM IST

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపర్చుకోకపోతే.... సమాజంలో వెనుకబడి పోతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పిల్లలకు ర్యాంకులు, తాము నిర్దేశించిన ఉద్యోగమే రావాలనే ధోరణి తల్లిదండ్రుల్లో మారాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌ గోల్కొండ పరిధిలోని తారామతి భారాదరి రిసార్ట్‌లో.... తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో మంత్రి సబితతో పాటు కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, సబితా... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థుల ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తమంగా నిలిచిన 5 ఆవిష్కరణలకు బహుమతుల ప్రదానం చేశారు.

'మన ఊరు-మనబడి' పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాఠశాలలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఇవ్వబోతున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి పాఠశాలలో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు. టీచర్‌ ఇన్నోవేషన్‌ పోర్టల్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. స్కిల్‌, అప్‌స్కిల్‌, రీ స్కిల్‌ ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని కోరారు. త్వరలో వైహబ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లలు వైహబ్‌లో కొత్త విషయాలు నేర్చుకునేందుకు వీలుగా ఉంటుందని వెల్లడించారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు. నిపుణుల అనుభవాలను పిల్లలు నేర్చుకునేందుకు దోహద పడతాయని వివరించారు.

'' 33 జిల్లాల నుంచి 20 జట్లను ఎంపిక చేశాం. అందులో అధ్బుతమైన 5 ఆవిష్కరణలను ఎంపిక చేసి.. వారికి అవార్డులను అందజేశాం. పిల్లల్లో తయారు చేయాలనే ఉత్సహం తపన ఉంటుంది. పిల్లలు ఒకరి వద్ద పనిచేయకుండా... వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహించాం. పిల్లల్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్నోవేషన్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. టీ -హబ్, వీ-హబ్, ఇంటింటా ఇన్నోవేషన్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. రూ.6 కోట్లతో వై-హబ్ తీసుకురాబోతున్నాం. 10వేల స్క్వేర్ ఫీట్లలో టీ-హబ్ రెండో దశ ప్రాజెక్టులో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాటశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఊరు-మన బడి మూడేళ్లలో అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోకపోతే వెనకబడిపోతాం.''

- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ప్రతి ప్రభుత్వ బడిలో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు: కేటీఆర్

ఇదీ చదవండి: పీయూష్‌ గోయల్‌పై ప్రివిలేజ్​ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

Last Updated : Apr 4, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.