ETV Bharat / state

KTR Review: 'హైదరాబాద్‌లో వార్డు పరిపాలన పద్ధతికి త్వరలోనే శ్రీకారం'

ward administration system in Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో త్వరలోనే వార్డు పరిపాలన పద్ధతికి శ్రీకారం చుట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సచివాలయంలో పురపాలకశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో ఈనెల చివరి వారంలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ktr
ktr
author img

By

Published : May 3, 2023, 5:02 PM IST

Updated : May 3, 2023, 7:18 PM IST

ward administration system in Hyderabad: పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా పరిపాలన ఫలాలు అందుతాయని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ భవనంలో పురపాలకశాఖపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. త్వరలో హైదరాబాద్‌ నగరంలో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం చుట్టునున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల చివరి వారంలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

KTR Comments on Ward administration :ఈ సందర్భంగా అధికారులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. వార్డు కార్యాలయంలో అధికారుల పనితీరు, సిబ్బంది పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ప్రతి వార్డు కార్యాలయంలో పది మంది అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్‌ఛార్జిగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తుతం సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు పరిధిలోనే, తమ ఫిర్యాదులను, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

KTR review with municipal officials: వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం రావడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగసామ్యం పెంచడమే నూతన విధాన లక్ష్యమని చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీగా జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలు ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతివార్డు ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం కావాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదార్లు నిర్వహణ, ఎంటమాలజీ, వెటర్నరీ, టౌన్ ప్లానింగ్, జలమండలి వంటి తదితర కీలకమైన విభాగాలకు చెందిన 8 నుంచి 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని వెల్లడించారు.

ఒకటి, రెండు వారాల్లో వార్డు కార్యాలయాల్లో ఉంచాల్సిన సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొత్తం బృందాలను రెండో వారంలోగా సిద్ధం చేసి వార్డు పాలనా వ్యవస్థ ఉద్దేశాలు, లక్ష్యాలు, పనిచేసే విధానంపై అన్ని అంశాలలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వార్డు కార్యాలయాలను సామాజిక మాధ్యమాలతో అనుసంధానమయ్యేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులకు కేటీఆర్ ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.