ETV Bharat / state

'గాంధీ ఆశయాలు చెప్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటాం'

author img

By

Published : Oct 29, 2019, 12:59 PM IST

మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుమేరకు హైదరాబాద్​ చిక్కడపల్లిలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. యాత్రలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ గాంధీ ఆశయాలను ప్రజలకు వివరిస్తామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

'గాంధీ ఆశయాలు చెప్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటాం'

స్థానిక సమస్యలు తెలుసుకుంటూ మహాత్ముని ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాంధీ సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. హైదరాబాద్‌ చిక్కడపల్లిలో కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ యాత్రలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, అవినీతి రహిత, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మోదీ పాటు పడుతున్నారని.. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజలు సహకరించాలని కిషన్​రెడ్డి కోరారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఏడాది పాటు యాత్ర కొనసాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వివరించారు.

'గాంధీ ఆశయాలు చెప్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటాం'

ఇదీ చదవండిః గాంధీ ఆశయ సాధన ప్రతిఒక్కరి బాధ్యత: కిషన్​రెడ్డి

TG_Hyd_14_29_Kiahan Reddy On Gandhi Sankalpa Yatra_Ab_TS10005 Note: Feed Etv Office Contributor: Bhushanam ( ) ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధి సంకల్ప యాత్ర చేపట్టిన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఈ యాత్ర సంవత్సరం పాటు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు... చిక్కడపల్లి లోని పలు విధులు, రాంనగర్ యాత్ర ను కొనసాగించారు. ఈ యాత్రలో ప్రజలకు గాంధీ ఆశయాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. స్వచ్చ భారత్... అవినీతి రహిత... ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మోదీ పాటు పడుతున్నారని.... ఆ దిశగా ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కరీంనగర్ లో యాత్ర చేపడుతున్న తమ పార్టీ ఎంపీ ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడాన్ని ఖండించారు. వారికి కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తప్ప వారికి ఎవరు కనపడడం లేదని విమర్శించారు. గాంధీ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటు... ఓట్లు దండుకోవడాని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందే తప్ప గాంధీ పై ఎలాంటి చిత్త శుద్ధి లేదన్నారు. ఆ పార్టి నాయకులకు అన్ని సమస్యలకు ప్రజలే తగిన బుధ్ధి చెపుతారని స్పష్టం చేశారు. బైట్: కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బైట్: లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.