తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని పార్థీవదేహానికి నివాళులు అర్పించి...తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మినారాయణ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కేటీఆర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మినారాయణకు నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: 'రూల్స్' పాటించమన్నందుకు డీలర్‌తో ఫైటింగ్