ETV Bharat / state

JAGADEESH REDDY: 'అలా చేస్తే ఏపీతో చర్చలకు సిద్ధం!' - telangana news

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు జీవో ఉపసంహరించుకుని వస్తే.. ఏపీతో చర్చలకు సిద్ధమని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నుంచి ఒక్క చుక్క నీటినీ ఏపీకి వెళ్లనీయమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా న్యాయ పోరాటం చేస్తూనే.. తెరాస పార్టీ పరంగా ప్రజలను ఏకం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించడంతో పాటు.. ప్రేక్షకపాత్ర వహిస్తోన్న కేంద్రం తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు.

'అలా చేస్తే ఏపీతో చర్చలకు సిద్ధం'
'అలా చేస్తే ఏపీతో చర్చలకు సిద్ధం'
author img

By

Published : Jun 25, 2021, 5:22 PM IST

Updated : Jun 25, 2021, 7:15 PM IST

'అలా చేస్తే ఏపీతో చర్చలకు సిద్ధం!'

రాజ్యాంగ బద్ధంగా, చట్టపరంగా నడవాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా, అనాగరికంగా వ్యవహరించడం మంచిది కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం సర్వే మాత్రమే చేస్తున్నామని చెప్పి.. కోర్టు ఉత్తర్వులనూ లెక్క చేయకుండా తెలంగాణను మోసం చేసి దొంగతనంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు వీడియోలు, ఫొటోలు సహా ఆధారాలు సేకరించామని.. మరోసారి ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. కేంద్ర జలవనరుల మంత్రితో సీఎం కేసీఆర్ స్వయంగా ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడి.. ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే.. తామూ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేశారన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వెంటనే పనులు ఆపి.. జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్రం తీరును ఎండగడతాం..

ప్రతిపక్షాలు కలిసి వచ్చినా, రాకపోయినా.. ఏపీ సీఎం జగన్ ద్రోహాన్ని అడ్డుకొని తీరుతామని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లో వాటాలో ఒక్క చుక్క నీటినీ ఏపీకి వెళ్లేందుకు అనుమతించమన్నారు. ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు రాజ్యాంగబద్ధమైన పాత్ర పోషించాల్సిన కేంద్రం.. ప్రేక్షక పాత్ర పోషిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెరాస పక్షాన ప్రజలను ఏకం చేసి.. ఏపీని నిలవరిస్తామని.. కేంద్రం తీరును ఎండగడతామని హెచ్చరించారు.

రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ.. జగన్ గజదొంగ..

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుట్రల్లో భాగస్వాములైన నేతలు.. ఆయనకు హారతి పట్టిన నాయకులు ఇవాళ ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ అయితే... జగన్ గజదొంగ అని చెప్పాల్సిన తెలంగాణ విపక్ష నేతలు.. ప్రభుత్వంపై దాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుడంటే వైఎస్‌కు భయపడి నోరు మెదపకపోవచ్చునన్న మంత్రి.. కనీసం ఇప్పుడైనా తెలంగాణ పక్షాన ఎందుకు నిలబడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా, కమ్యూనిస్టు పార్టీలు సహా జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు మోసం చేసినవే తప్ప.. ఏనాడూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేదని దుయ్యబట్టారు.

తండ్రి నుంచి అలవాటుగా వచ్చినట్లుంది..

రాజన్న రాజ్యమంటే నోరెత్తినోళ్లను కాల్చేయడం.. పక్కవారి హక్కులను కాలరాసి నీటిని తోడేయటమేనని మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటి రాజ్యం కోసం షర్మిళ ఉవ్విళ్లూరవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలు స్వాగతించరని అన్నారు. గోదావరి మిగులు జలాలు వినియోగించుకోవాలని జగన్‌కు కేసీఆర్ సూచించారన్న ఆయన.. ఏపీకి నీళ్లిచ్చే ఆలోచన కానీ.. అక్కడి ప్రజలకు మంచి పాలన అందించే ఉద్ధేశం కానీ జగన్‌కు లేనట్లుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడం జగన్‌కు తండ్రి నుంచి అలవాటుగా వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ..

తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. ఒకవేళ ఏపీ ప్రభుత్వం కోర్టులు చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించి ముందుకెళ్తే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఏం చేయాలో తమకు తెలుసునని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్‌ను మించి పోరాడే వారెవరూ లేరని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వైఎస్​ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

Last Updated : Jun 25, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.