కాలుష్య నియంత్రణ మండలిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. కాలుష్య కారకులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నిరంతర పర్యవేక్షణతోనే కాలుష్యానికి చెక్ పెట్టగలమన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో జీవ వ్యర్థాల సేకరణ, నిర్వీర్య ప్రక్రియ కొనసాగాలన్నారు. కొవిడ్ బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణపై ఆరా తీశారు. కొవిడ్ వ్యర్థాలను తరలించి నిర్వీర్యం చేస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని 11 బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాలకు తరలిస్తున్నామని... ఇప్పటివరకు 281.8 టన్నుల వ్యర్థాలను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో మంత్రి టీఎస్ ఎయిర్ మొబైల్ యాప్ ఆవిష్కరించారు. గాలి నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ ఈ యాప్ను రూపొందించినట్లు వెల్లడించారు. ఫొటోలతో ఈ యాప్ ద్వారా కాలుష్యంపై ఫిర్యాదు చేసే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు వసతి