Harishrao on Central: కేంద్రప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను కేంద్రప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. 750 మంది రైతులను పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రధాని హామీలకే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. భాజపా నేతలు ఇచ్చే హామీలు అమలవుతాయంటే ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడ్డారు.
ప్రధాని సొంత రాష్ట్రంలోనే పింఛన్ రూ.750 ఇస్తున్నారు... మునుగోడులో మాత్రం రూ.3వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇంతకంటే మోసం, అబద్ధపు మాటలు ఎక్కడైనా చూస్తామా? అని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం... తెలంగాణ అని స్పష్టం చేశారు. భాజపా వాగ్దానం అంటేనే జుమ్లా అని ఫైర్ అయ్యారు. భాజపా అబద్ధాలు దేశప్రజలందరికీ అర్థమైపోయాయని వివరించారు.
రైతులను కేంద్రప్రభుత్వం అణచివేస్తోంది. కేంద్రం 750 మంది రైతులను పొట్టనపెట్టుకుంది. ప్రధాని హామీలకే దిక్కులేకుండా పోయింది. భాజపా నేతలు ఇచ్చే హామీలు అమలవుతాయంటే ప్రశ్నార్థకమే. ప్రధాని సొంత రాష్ట్రంలోనే పింఛన్ రూ.750 ఇస్తున్నారు. మునుగోడులో మాత్రం రూ.3వేలు ఇస్తారా? ఇంతకంటే మోసం, అబద్ధపు మాటలు ఎక్కడైనా చూస్తామా? -హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: