ETV Bharat / state

టిఫా స్కానింగ్​తో శిశువుల్లో లోపాలను గుర్తిద్దాం: హరీశ్‌రావు

Harish Rao Launched TIFA Scanning Missions: రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ మిషన్​లను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సగటున 100 మంది శిశువుల్లో 7 శాతం శిశువులకు లోపాలు ఉంటున్నాయని చెప్పారు. చిన్నారుల్లోని ఈ లోపాలను టిఫా స్కానింగ్​తో గుర్తించడం సాధ్యమవుతుందుని హరీశ్​రావు పేర్కొన్నారు.

author img

By

Published : Nov 26, 2022, 6:44 PM IST

Harish Rao
Harish Rao

Harish Rao Launched TIFA Scanning Missions: రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 43 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రూ.20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్‌లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌ పేట్ల బురుజు ఆసుపత్రి వేదికగా మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌ విధానంలో టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ మిషన్​లను ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. సగటున 100 మంది శిశువుల్లో 7శాతం శిశువులకు లోపాలు ఉంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని ఈ లోపాలను టిఫా స్కానింగ్​తో గుర్తించడం సాధ్యమవుతుందుని చెప్పారు. గతంలోనూ పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ పథకాన్ని.. సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 99.2 శాతం ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయని హరీశ్​రావు పేర్కొన్నారు.

ఈ టిఫా యంత్రాల ద్వారా నెలకు 20వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలగనుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేయడానికి రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చవుతుండగా.. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా నిర్వహించనున్నామని చెప్పారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, వైద్యరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

శిశువుల్లో లోపాలను టిఫా స్కానింగ్​తో గుర్తించడం సాధ్యం: హరీశ్‌రావు

ఇవీ చదవండి: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త కమిటీలపై జోరుగా కసరత్తు.. 2023 ఎన్నికలే లక్ష్యం

ఇంధనం లేక నిలిచిపోయిన అంబులెన్స్​.. తోసుకుంటూ వెళ్లిన బంధువులు.. అయినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.