ETV Bharat / state

మళ్లీ కొవిడ్ విజృంభణ... నిబంధనలు పాటించాల్సిందే: మంత్రి హరీశ్​ రావు

Harish Rao: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్​ రావు స్పషం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హరీశ్​ రావు
హరీశ్​ రావు
author img

By

Published : Jun 4, 2022, 9:33 PM IST

Harish Rao: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు స్పష్టంచేశారు. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న తరుణంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమెరికా, ఉత్తరకొరియా, జర్మనీలో భారీగా కేసులు పెరిగాయని.. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు రెట్టింపు అవుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణలో ఉన్నా వైద్యారోగ్య శాఖ సిబ్బంది విధుల్లో అలసత్వంతో ఉండరాదని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అన్నారు.

ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణలో సిబ్బంది బాగా పనిచేశారని.. భవిష్యత్‌లో అదే స్పూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 లక్షల డోస్‌ల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని.. ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు ఇవ్వాలనిఆదేశించారు. బూస్టర్ డోస్ అవసరమైన వారిని గుర్తించి టీకాలు వేయాలని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాక్సినేషన్ వేసుకోని వాళ్లను ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ఇంటింటికి వెళ్లి టీకాలు వేయాలని హరీశ్‌ రావు తెలియచేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో కూరగాయల ధరలు ఇలా..

'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం.. వారు సైతం తీసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.