ETV Bharat / state

కేంద్రంలో పెండింగ్ ప్రభుత్వం.. మాది స్పెండింగ్ ప్రభుత్వం: హరీశ్‌రావు - harish rao on union government

Harish Rao fire on Modi govt: విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రప్రభుత్వం పూర్తి వివక్ష చూపిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎనిమిదేళ్లు అయినా నదీ జలాల్లో వాటా తేల్చకుండా చేయడం తెలంగాణపై వివక్ష కాదా అని నిలదీశారు. ఏ విషయంపైన అయినా నాన్చుడు, పెండింగులో పెట్టడం కేంద్రానికి అలవాటు అయ్యిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేంద్రం పెండింగ్ ప్రభుత్వం, రాష్ట్రం స్పెండింగ్ ప్రభుత్వమన్నారు.

కేంద్రంలో పెండింగ్ ప్రభుత్వం.. మాది స్పెండింగ్ ప్రభుత్వం: హరీశ్‌రావు

author img

By

Published : Sep 13, 2022, 8:12 PM IST

Harish Rao fire on Modi govt: విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే గిరిజన యూనివర్సిటీ జాడలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కుపరిశ్రమ రాదు.. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ అడ్రస్‌ లేదన్నారు. జాతీయ హోదా సంగతి దేవుడెరుగు.. ఇలా అనేక అన్యాయాలు చేశారని మండిపడ్డారు. దేశంలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే.. తెలంగాణకు కేటాయించింది సున్నా అని హరీశ్‌రావు మండిపడ్డారు. 7 ఐఐటీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 157 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను కేంద్రం ఇస్తే.. తెలంగాణకు ఇచ్చింది ఏమీలేదన్నారు. వీటన్నింటినీ మంజూరు చేయించేందుకు ఈ రాష్ట్ర భాజపా ఎంపీలు, నాయకులు చేస్తున్న కృషి ఏమన్నా ఉందంటే అది పెద్ద గుండుసున్నా అని మంత్రి విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం..: గత 8 ఏళ్లలో ఐటీ రంగంలో 15శాతం వృద్ధి సాధించాం. ఉత్పత్తిని మూడున్నర రెట్లు పెంచగలిగాం. ఈ దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లో దక్కేలా చేయడం సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి చేసిన కృషే అందుకు కారణం. పారిశ్రామిక కారిడార్‌లో మొండి చేయి చూపించారు. అయినా, తెలంగాణ ప్రభుత్వం బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ వల్ల 20వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. 16లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను పక్కనున్న రాష్ట్రాలకు ఇచ్చారు కానీ, తెలంగాణకు ఇవ్వలేదు. అయినా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద ఫార్మాసిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నాం. మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయినా, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వేలాది చెరువులు బాగు చేసుకున్నాం. వాటి ఫలాలు ఇవాళ తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. ఈ రాష్ట్రంలో 4.06 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. 4.06 మీటర్ల భూగర్భ జలాలు పెరగడమంటే దాదాపు 400 టీఎంసీల భూగర్భ జలాలు పెంచుకున్నట్టే. కేంద్రం తెచ్చిన అమృత్‌ సరోవర్‌ కార్యక్రమానికి మిషన్‌ కాకతీయ ప్రేరణ కావడం తెలంగాణకు గర్వకారణం.-హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి

మా పథకాలను కాపీ కొడుతున్నారు..: 70 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని . కానీ, ఏడేళ్లే కేసీఆర్‌ పాలనలో 5 నుంచి 33 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకోగలిగామని హరీశ్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. నిధులు రాకుండా అడ్డుపడినా.. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చామని చెప్పుకొచ్చారు. మిషన్‌ భగరీథకు నీతి ఆయోగ్‌ రూ.19వేల కోట్లు ఇవ్వమని సిఫారసు చేస్తే .. కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. అయినా చెప్పిన సమయంలోనే మిషన్‌ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథను కాపీకొట్టి హర్‌ ఘర్‌ జల్‌ పథకం తీసుకొచ్చారని... ఇదికూడా తెలంగాణ ప్రజలకు గర్వకారణమేనన్నారు. రైతు బంధు పథకాన్ని పీఎం కిసాన్‌ యోజన పేరు మీద దేశమంతా అమలు చేస్తున్నారని, ఇది కూడా తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్లు, మైనార్టీల రిజర్వేషన్లు.. ఇలా అనేక అంశాలపై శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తే.. పెండింగ్‌లో పెట్టారు తప్ప ఒక్కటి కూడా పరిష్కరించలేదని సభకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పెండింగ్‌ ప్రభుత్వం అయితే.. కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌ ప్రభుత్వంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని... ఎనిమిదేళ్లయినా ఈ రాష్ట్రానికి పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన సంస్థలు, ఇవ్వాల్సిన నిధులు, చేయాల్సిన కేటాయింపుల విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

‘డేర్‌ టు డ్రీమ్‌’ అనేది మా ప్రభుత్వ నినాదం..: జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.లక్ష కోట్లు, రూ.50వేల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవంగా జాతీయ రహదారులపై తెలంగాణలో కేంద్రం ఖర్చు చేసింది రూ.21,676 కోట్లు. ఈ డబ్బులు కూడా తెలంగాణ రోడ్లను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో రోడ్లు వేసి, టోల్‌గేట్ల ద్వారా ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తారు. పేరుకు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఇచ్చినట్టు గొప్పలు చెబుతున్నారు. పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.. మేం అధికారంలోకి వస్తే యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని మోదీ స్వయంగా చెప్పారు. కానీ, ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదు. కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే తేల్చలేని దిక్కుమాలిన భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటని పరిస్థితి కేంద్రానిది. తెలంగాణకు వారం వారం వచ్చే మంత్రులకు విజ్ఞప్తిచేస్తున్నా...ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాలపై సమీక్షించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోవాలనేది మా తాపత్రయం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నించింది. ప్రశ్నించే రాష్ట్రాలను కేంద్రం రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది. కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్తకాదు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెబుతుంటారు.. ‘డేర్‌ టు డ్రీమ్‌’ అనేది మా ప్రభుత్వ నినాదం’’ -హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి

కేంద్రంలో పెండింగ్ ప్రభుత్వం.. మాది స్పెండింగ్ ప్రభుత్వం: హరీశ్‌రావు

ఇవీ చూడండి..

'కేంద్రం మాదిరిగా సంపదను మేం మిత్రులకు పంచలేదు.. పేదలకు పంచాం'

ప్రభుత్వ స్కూల్​కు బస్సు.. ఆ మొక్కలతో లాభార్జన.. ఐదేళ్ల శ్రమకు ఫలితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.