ETV Bharat / state

'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు' - మంత్రి హరీశ్ రావు వార్తలు

విపత్కర వేళ కరోనా కట్టడికి అంతా కలిసి సాగుతుంటే... ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతిపక్షాలను ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారని... అయినా వారిలో మార్పులేదని విమర్శించారు.

minister-harish-rao-fire-on-opposition
'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'
author img

By

Published : Apr 14, 2020, 8:18 AM IST

తెలంగాణ ప్రభుత్వం ఒక చేతితో కరోనాపై పోరాడుతూ... మరో చేతితో రైతు సంక్షేమానికి పాటుపడుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి విపత్కర వేళ కరోనా కట్టడికి అంతా కలిసి సాగుతుంటే... ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్షాలను ఎప్పుడో క్వారంటైన్‌లో పెట్టారని, అయినా వారిలో మార్పు రావడం లేదన్నారు.

3.5 లక్షల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతో పాటు రూ.500 అందించామన్నారు. ఇంకా ఎక్కువ మందికి అందించనున్నామన్నారు. ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నారన్నారు. ఇప్పటికే 87 శాతం మంది తెల్ల రేషన్ కార్డుదారులకు సరుకులు అందాయని... వీరికి నగదు అందించేందుకు ప్రభుత్వం నిధులు సైతం విడుదల చేసిందన్నారు. బ్యాంకు ఖాతాల్లోనూ ఆ డబ్బులు జమవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం పేదల కోసం ఇప్పటికే రూ.3,147 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: పసిబిడ్డకు 'శానిటైజర్‌'గా నామకరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.