మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావును(Exhibition society president)ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావును(harish rao) ఎన్నుకుంటున్నట్లు మేనేజింగ్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించిన వార్షిక జనరల్ బాడీ మీటింగ్‌లో కొత్త కార్యవర్గం( Exhibition society new committee) ఏర్పాటైంది.
ఎగ్జిబిషన్ కమిటీ కొత్త కార్యవర్గం
2021-22 సంవత్సారానికి గానూ ఎంపికైన ఆఫీస్ బేరర్లను కమిటీ వెల్లడించింది. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ప్రభా శంకర్, కార్యదర్శిగా ఆదిత్య మార్గం, సంయుక్త కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా ధీరజ్ కుమార్ జైశ్వాల్‌ను ఎన్నుకున్నట్లు మేనేజింగ్ కమిటీ(managing committee) తెలిపింది. వీరితో పాటు మరో ఏడుగురు మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
నుమాయిష్ నిర్వహణ
హైదరాబాద్ నాంపల్లి మైదానంలో ఏటా 45 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామికవేత్తల వస్తు ప్రదర్శనను ఈ కమిటీ నిర్వహిస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని మంత్రి హరీశ్ రావుతో భర్తీ చేసి నూతన కార్యవర్గాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా నుమాయిష్‌ను నిర్వహించకపోవటం అందరికీ తెలిసిందే.