ETV Bharat / state

బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి: గంగుల - తెలంగాణ టాప్ న్యూస్

Gangula kamalakar BC caste communities : హైదరాబాద్​లో బీసీ కులాల ఆత్మగౌరవ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల అనుమతి పత్రాలు అందజేశారు.

Gangula kamalakar BC caste communities , talasani srinivas yadav, srinivas goud
బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి : గంగుల
author img

By

Published : Feb 2, 2022, 4:44 PM IST

Gangula kamalakar about BC caste communities : బీసీ కులాల మధ్య ఐఖ్యత ఉంటే... భవిష్యత్తులో ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు వెళ్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు - రాష్ట్ర స్థాయి రిజిస్టర్డ్ కుల సంఘాల నాయకుల సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఏక సంఘంగా ఏర్పడిన 14 బీసీ కులాల నాయకులకు మంత్రుల చేతుల మీదుగా ఆత్మగౌరవ స్థలాలు, భవనాల అనుమతి పత్రాలు అందజేశారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే...

బీసీ కులాలకు భూములు ఇవ్వడమే కాదు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ 41 కులాల్లో 14 కులాలకు భూమి పట్టాలు అందజేశామని... మిగతా కుల సంఘాలు కూడా ఐఖ్యంగా ముందుకు వస్తే భూములు ఇస్తామని ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఆ భూముల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తామని గంగుల వెల్లడించారు. కుల, చేతి వృత్తులకు పునరుత్తేజం తీసుకొచ్చి... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తుంటే... చేపలు, గొర్రెలు ఇస్తారా అంటూ భాజపా నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు‌. బీసీ కులాల ఐఖ్యత దెబ్బతీసే శక్తులను ఉపేక్షించవద్దని... వెనుకబడిన కులాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ భరోసానిచ్చారు.

ఫిబ్రవరి చివరి నాటికి బీసీల్లోని కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. మిగతా కుల సంఘాలు కూడా ఐఖ్యంగా ముందుకు వస్తే భూములు ఇస్తాం. మార్చి మొదటి వారంలో ఆ భూముల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తాం.

-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి : గంగుల

మార్చిలో శంఖుస్థాపన..

దేశంలో జనాభా ప్రాతిపదిక 60 శాతం బీసీ కులాలు ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏళ్లవుతున్నా ఏ ప్రభుత్వం గుర్తించలేదని... రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో బీసీ కులాలకు ఆత్మగౌరవం ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములు అందిస్తున్నామని అన్నారు. కోకాపేట, ఉప్పల్ భగాయత్, మేడ్చల్ ప్రాంతాల్లో రూ.500 కోట్లతో భూములు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బీసీ కులం అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ... కనీస ఒక‌ మంత్రిత్వ శాఖ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు.

భవిష్యత్తులో బీసీ కులాల మధ్య ఐఖ్యత ఉంటే ముందుకు వెళ్తాం. దేశంలో జనాభా ప్రాతిపదిక 60 శాతం బీసీ కులాలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్యం సిద్ధించి 74 ఏళ్లవుతున్నా ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో బీసీ కులాలకు ఆత్మగౌరవం ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములు అందిస్తున్నాం. కోకాపేట, ఉప్పల్ భగాయత్, మేడ్చల్ ప్రాంతాల్లో రూ.500 కోట్లతో భూములు ఇస్తున్నాం. భూములు ఇవ్వడమే కాదు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతుంది. ఇవాళ 41 కులాల్లో 14 కులాలకు భూమి పట్టాలు అందజేశాం.

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇదీ చదవండి: KTR tour in Medchal: 'హైదరాబాద్​కు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. గుజరాత్​కు వెయ్యి కోట్లా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.