ETV Bharat / state

Gangula: 'కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 14న ఉపసంఘం భేటీ' - మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో నూతన రేషన్ కార్డుల జారీ, చౌక ధరల దుకాణాల డీలర్ల అపరిష్కృత సమస్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి. అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

minister
సీఎం కేసీఆర్
author img

By

Published : Jun 11, 2021, 7:40 PM IST

రాష్ట్రంలో అన్నార్థుల ఆకలిని తీర్చే మానవతావాది ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల జారీ, చౌక ధరల దుకాణాల డీలర్ల అపరిష్కృత సమస్యలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి. అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆ అంశాలపై చర్చ...

కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 14న జరగబోయే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం ముందుంచే పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల జారీ సత్వరమే చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది.

కార్డుల జారీ...

కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం మంత్రి గంగుల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన విషయం విదితమే. మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కూడిన ఈ కమిటీ 14న సమావేశమై విధి విధానాల గురించి చర్చించనుంది. కొత్త కార్డుల జారీతోపాటు ఇందులో ముడిపడి ఉన్న అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు మంత్రివర్గ ఉపసంఘం ముందుంచాలని మంత్రి ఆదేశించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణల అమలులో శరవేగంగా తెలంగాణ దూసుకుపోతున్న తరుణంలో ప్రస్తత కరోనా సంక్లిష్ట సమయంలో అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం కేసీఆర్ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తోందని గంగుల (Gangula Kamalakar) పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.