ETV Bharat / state

మరో 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి.. ఇప్పటివరకూ ఎంతంటే.?

author img

By

Published : Jun 3, 2022, 6:45 AM IST

Paddy Grain Procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోంది. యాసంగి ధాన్యం సేకరణ సంబంధించి ఆరంభం నుంచి అధికార, విపక్షాల మధ్య ఓ రాజకీయ వివాదంగా మారిన తరుణంలో... మరో పది రోజుల్లో పూర్తి కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 7.7 లక్షల మంది రైతుల నుంచి రూ. 8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల శాఖ.. మరో 11.43 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే 2,257 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. గురువారం ధాన్యం కొనుగోళ్ల అంశంపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శ్వేతపత్రం విడుదల చేశారు.

Paddy Grain Procurement
తెలంగాణలో ధాన్యం సేకరణ

Paddy Grain Procurement: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ... ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. 2021-22 యాసంగి మార్కెటింగ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ప్రస్తుతం రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు పైగా సేకరిస్తున్న తరుణంలో మరో పది రోజుల్లోపు పూర్తి స్థాయిలో సేకరణ పూర్తవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 కోట్ల 69 లక్షల గన్నీ బ్యాగులు సేకరించడంతోపాటు ఇంకా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోగల 3 కోట్ల 37 లక్షల సంచులు అదనంగా అందుబాటులో ఉంచింది. ఇదే స్థాయిలో కొనుగోళ్లలో ప్రతీ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్ టన్నులు సైతం సేకరించింది.

పూర్తయినవి మూసివేత: ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేసిన దృష్ట్యా... గురువారం వరకు 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 7 వేల మంది రైతుల వద్ద నుంచి రూ. 8 వేల కోట్ల విలువైన గల 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు సైతం తరలించింది. కొనుగోళ్లు ముగిసిన 2,257 కేంద్రాలను మూసివేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్కడా నిల్వ సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్, జగిత్యాల, మెదక్ వంటి అధిక వరి పండిన ప్రాంతాల నుంచి మిల్లింగ్ కోసం అధిక సామర్థ్యం గల పెద్దపల్లి, కరీంనగర్, వనపర్తి, వరంగల్, జోగులాంబ జిల్లాలకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించారు. గోదాములు సైతం అందుబాటులో ఉన్నందున అవసరం ఉన్న మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఇంటర్మీడియట్ స్టోరేజీ ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

కేంద్రం సహకరించకపోయినా: జిల్లాల అంచనాల ప్రకారం... పీపీసీల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. కోతలు పూర్తి కావాల్సిన 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా వస్తోంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన చివరి గింజ వరకూ కొనాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సేకరిస్తామని మంత్రి గంగుల భరోసా ఇచ్చారు. అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో భాజపా సర్కారు మోకాలడ్డుతున్నా దాదాపు రూ. 3 వేల కోట్ల నష్టం భరించి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నామన్నామని పునరుద్ఘాటించారు. సమస్యలు తక్షణమే పరిష్కరించేలా టోల్‌ఫ్రీ నంబర్లు, కమిషనర్ కార్యాలయంలో వార్‌రూం ఏర్పాటుచేసి మిల్లర్లు, రవాణ, కొనుగోలు కేంద్రాలు, హమాలీలను అనుసంధానం ద్వారా కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు కొత్త గన్నీ బ్యాగులు 57 లక్షలు, పాతవి కోటీ 5 లక్షల మిగులుతో సేకరణ మొదలుపెట్టినప్పటికీ... కేంద్రం సకాలంలో అందించకున్నా ఓ సవాల్‌గా తీసుకొని అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా గన్నీ సంచీలు సేకరించి ఎక్కడా చిన్న సమస్య తలెత్తకుండా సఫలీకృతమయ్యామని మంత్రి పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలవైపు: ఈ యాసంగి మొదట్నుంచి కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష పూరితంగా వ్యవహరించి భయాందోళనలకు గురిచేసినా రైతు బాంధవుడు కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు యాసంగిలో గణనీయంగా వరి సాగు తగ్గిందని, ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లారని గుర్తు చేశారు. యాసంగిలో నూక శాతం ఉంటుందని తెలిసి ముడి బియ్యమే ఇవ్వాలని పట్టుబట్టిన కేంద్రం మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడినా కమిటీని ఏర్పాటు చేసి నష్టం భరించే విధంగా టెస్ట్ మిల్లింగ్ సైతం జరగబోతుందని స్పష్టం చేశారు. అయినా ప్రతిపక్షాలన్నీ కలిసి రైతుల్ని గందరగోళ పర్చేలా ప్రకటనలు చేయడమే కాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రెచ్చగొట్టేలా వ్యవహరించినా రైతులు నమ్మలేదని... ఇది ప్రభుత్వంపై రైతులు, తమ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: రేపట్నుంచి పదిహేను రోజుల పాటు ఐదో దఫా పల్లె ప్రగతి కార్యక్రమాలు

'ద కశ్మీర్​ ఫైల్స్​' రిపీట్​.. హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు!

ఆ విషయం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి: భాజపా జాతీయ నాయకత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.