ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే లో భాగంగా హైదరాబాద్ కాప్రా సర్కిల్ మల్లాపూర్ వద్ద తెరాస జెండాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కరోనా వల్ల రక్త నిల్వలు లేక తలసేమియా పేషెంట్లు, ప్రమాదాలకు గురైన వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఈటల అన్నారు. తమ విజ్ఞప్తిని విని రక్తదానాలు చేయడానికి వేలాది మంది ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...