పేదలకు వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో 106 సెంటర్లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత జీహెచ్ఎంసీదే అని స్పష్టం చేశారు. డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ నియమిస్తుందని అన్నారు. 270కి పైగా మందులు సమకూర్చినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: బాధితురాలు కాబట్టే సునీత కన్నీరు పెట్టుకున్నారు: మంత్రి ఈటల