ETV Bharat / state

'పల్లె ప్రగతి, హరితహరం కార్యక్రమాలకు ఆటంకం రాకూడదు'

పల్లె ప్రగతి, హరితహరం, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.

Minister Errabelli review meeting hyderabad wants things done faster
పథకాల అమలు తీరుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
author img

By

Published : Aug 10, 2020, 4:12 PM IST

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, డీపీఓలు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. శాఖలో అమలవుతోన్న వివిధ పథకాలు, జరుగుతున్న పనులపై జిల్లాల వారీగా చర్చించారు. కరోనా నేపథ్యంలో నెమ్మదించిన పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.

ఉపాధి హామీకి అనుసంధానం చేసిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, డంప్​ యార్డులు, ప్రకృతి వనాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని దయాకర్ రావు అధికారులకు తెలిపారు.

పథకాల అమలు తీరుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ఇదీ చూడండి : 'రూ. 2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకు దర్శకుడు శంకర్​కు ఎలా కేటాయించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.