ETV Bharat / state

క‌నీస స‌దుపాయాల క‌ల్ప‌న‌లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం: ఎర్ర‌బెల్లి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ప్రోత్సాహక నగదును పంచాయతీరాజ్ సంస్థలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వర్చువల్ విధానంలో అందించారు. కనీస సదుపాయాల కల్పనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

minister errabelli dayakar rao talk about center government  Incentive cash
క‌నీస స‌దుపాయాల క‌ల్ప‌న‌లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం: ఎర్ర‌బెల్లి
author img

By

Published : Nov 9, 2020, 8:00 PM IST

నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, పథకాలను కేంద్ర ప్రభుత్వం అభినందించడం హర్షణీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ప్రోత్సాహక నగదును పంచాయతీరాజ్ సంస్థలకు మంత్రి వర్చువల్ విధానంలో అందించారు.

జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు, అధికారులకు కోటీ 47 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సదుపాయాల కల్పనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న ఎర్రబెల్లి... సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి అత్యంత విజయవంతంగా అమలవుతోందని అన్నారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, ఆహ్లాదకర వాతావరణం పరిఢవిల్లుతోందని, అంతగా విజయవంతమైన పల్లెప్రగతి కార్యక్రమానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం సాయం చేయ‌క‌పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని దయాకర్ రావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.