Minister errabelli on asara pensions : ఆసరా పెన్షన్లలో కేంద్ర సాయం నామమాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా తక్కువ పెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానామిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు... ఏప్రిల్ నుంచి మరో ఏడున్నర లక్షల మందికి ఆసరా పెన్షన్లను అందించనున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి, హరితహారం, పల్లె ప్రకృతివనం, నర్సరీలు, వైకుంఠధామాల ఏర్పాటు ద్వారా గ్రామాల ముఖచిత్రం మారిందని తెలిపారు.
''ఆసరా పెన్షన్లలో కేంద్ర సాయం నామమాత్రమే. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా తక్కువ ఇస్తున్నారు. ఏప్రిల్ నుంచి మరో ఏడున్నర లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.''- ఎర్రబెల్లి దయాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: రాజగోపాల్రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ