అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నేడు జన్మదినం జరుపుకుంటున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి శాసనసభ తరఫున సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
57 ఏళ్లు నిండిన అర్హులందిరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. పింఛన్ల కోసం ప్రతినెల రూ.879 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఎంత ఖర్చయినా పింఛన్లు కచ్చితంగా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల తర్వాత కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!