సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి.. సర్పంచులు, కార్యదర్శులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై చర్చించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తగు ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. భూపాలపల్లి జిల్లాతో పాటు గ్రేటర్ వరంగల్ నగరపాలిక అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఆరో తేదీన హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.
ఇదీ చదవండి: 'అమరులకు నివాళులర్పించే సంప్రదాయం తెచ్చేలా స్మారకం'