ETV Bharat / state

కరోనా టెస్టింగ్ కిట్​లు పంపండి : కేంద్ర మంత్రితో ఈటల - minister eetala about corona

రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఈరోజు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మందులు, వైద్య పరికరాలపై టాక్స్​లు ఎత్తివేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

'రాష్ట్రానికి కరోనా టెస్టింగ్ కిట్​లను అందించండి'

author img

By

Published : Apr 10, 2020, 7:42 PM IST

రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఈరోజు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య పరికరాలు, కరోనా వైరస్ నివారణ కోసం వినియోగిస్తున్న మందులను బ్లాక్ మార్కెట్ జరగకుండా చూడాలని కోరారు. బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఈటల... రాష్ట్రంలో, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్​లు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలను కస్టమ్స్, ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు.

వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఈసీఐఎల్, డీఆర్​డీ లాంటి సంస్థల్లో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలని కేంద్రానికి విన్నవించారు. వీలైనంత త్వరగా ఎన్- 95మాస్కులు, పీపీఈ కిట్, కరోనా టెస్టింగ్ కిట్​లను అందించాలని కోరారు. ఇప్పటివరకు తెలంగాణలో కమ్యునిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని.. 8,500 మందికి కరోనా పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్రానికి వివరించారు.

ఇవీ చూడండి: తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది: దానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.