కరోనా వైరస్ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం వీరి ముగ్గురితో ఫోన్‌లో మంత్రి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడ కల్పించిన వసతుల పట్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తుల కుటుంబసభ్యులతో కూడా మంత్రి మాట్లాడారు. పూర్తిస్థాయి ఆరోగ్యవంతంగా ఇంటికి పంపిస్తామని వారికి భరోసా కల్పించారు. అంతకుముందు మహేంద్రహిల్స్ నివాసి గాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతని వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి ఆరోగ్యంతో అతనిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్ర కృషి చేయడం పట్ల సీఎం కేసీఆర్.. ఈటలను అభినందించారు.
ఇదీ చూడండి : విభజన రాజకీయాలు దేశానికి అవసరమా: సీఎం కేసీఆర్