కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్తో సమావేశమయ్యారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి హాజరయ్యారు.
''కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడకండి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు పోర్టల్లో నమోదు చేయండి. అనవసరంగా ఎవరికీ పరీక్షలు నిర్వహించవద్దు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు నడుచుకోండి. కొవిడ్ పరీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్లో ఉండేలా సూచించండి. తమ సిబ్బందికి వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.''
-మంత్రి ఈటల రాజేందర్
'అనవసరంగా ఎవరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయవద్దు'
కరోనా పరీక్షలపై అనవసర ప్రచారాలు చేయవద్దన్న ఈటల... విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయవచ్చన్నారు.
ఇవీ చూడండి: 'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'