ప్రజాస్వామ్య రక్షణకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ ఫిరాయింపులపై అన్ని వ్యవస్థలను కదిలించి.. దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేస్తామన్నారు. హస్తం గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి పార్టీ వీడితే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, తమ అధినేతపై అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఈ సీటు యమా హాటు