ETV Bharat / state

midnight violence in Hyderabad : ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేలా? - హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు

Ganja Batches Hulchal in Hyderabad : అర్ధరాత్రి దాటేవరకూ కాలనీ రోడ్లలో గుంపులుగా తిష్టవేస్తారు. వాళ్లలో వాళ్లే గొడవపడుతూ రసాభాస సృష్టిస్తారు. ఆకతాయితనంతో రోడ్డున పోయే వాళ్లను దూషిస్తారు. దుర్భాషలాడుతున్న వారిని.. ఇదేంటని ప్రశ్నిస్తే మారణాయుధాలతో దాడులకు తెగబడతారు. హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో గంజాయి మూకలు, మద్యం మత్తులో యువకుల జగడాలకు హద్దు లేకుండా పోతోంది. జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లాలంటే జనం జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Mob Attack Cases
Mob Attack Cases
author img

By

Published : Jun 8, 2023, 7:17 AM IST

శివారు ప్రాంతాల్లో సాయంత్రం దాటితే చాలు మత్తులో ఆరాచకం

Mob Attack Cases Hyderabad : హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి చరవాణులు, డబ్బులు విలువైన వస్తువులు దోపీడి చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో సాయంత్రం దాటితే చాలు మత్తులో ఆరాచకం సృష్టిస్తున్నారు. వాహనదారులపై దాడులకు దిగుతున్నారు. ఒకప్పుడు కార్యాలయాల్లో పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయాల్లో శునకాల బెడదతో ఇబ్బందిపడే నగర ప్రజలు.. ఇప్పుడు ఆకతాయిలు, నేరగాళ్లకు భయపడతున్నారు.

midnight violence in hyderabad : గత నెలలో జగద్గిరిగుట్ట పరిధిలో ఓ ముఠా హల్‌చల్‌ సృష్టించింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఆటో ఎక్కుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు. గత నెల 14న జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లో దుండగులు కత్తితో బెదిరించి.. మొబైల్‌ఫోన్, కొంత నగదు లాక్కొని దాడి చేశారు. గత నెలలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమాజిగూడ ప్రాంతంలోనూ.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగి విధులు ముగించుకుని వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు అతనిపై దాడి చేశారు. అతడి వద్ద చరవాణి, గొలుసు లాక్కొని వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Mob Attack on a Young Boy for Cell Phone : తాజాగా హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న పవన్‌కుమార్ అనే వ్యక్తిపై.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న చరవాణిని తీసుకుని పారిపోయారు. గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం.. నగరంలో గంజాయి వినియోగం పెరగడమేనని స్థానికులు వాపోతున్నారు.

గంజాయి సరఫరా వ్యవస్థను, స్మగర్లను పోలీసులు కట్టడి చేస్తున్నా.. మత్తు పదార్థాలు దొడ్డిదారిలో నగరానికి చేరుతూనే ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని గల్లీలు, చిన్న దుకాణల్లోనూ గుట్టుచప్పుడుకాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సరకు కోసం విద్యార్థులే స్మగ్లర్లుగా మారుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులకు వెళ్లి గంజాయి తెచ్చుకుంటున్నారు. తరచూ మందు పార్టీల పేరిట సమావేశమై గంజాయి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రాత్రిపూట గ్రూపులుగా విడిపోయి నడిరోడ్లపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల ఇళ్ల మీదా దాడి చేస్తున్నారు. రాత్రి 9నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి తరచూ వెలుగు చూస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రించే దిశగా అడుగులు పడడం లేదని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ తగ్గిపోవడం వల్లే గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయని కాలనీ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.