కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మెట్రోలో (hyderabad metro) ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రోజూ 2.30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో రోజూ 4 లక్షల మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందని అన్నారు.
మెట్రోరైలులో ప్రయాణికులకు సువర్ణ ఆఫర్లలో 2021(Metro suvarna Offer winners) భాగంగా నెలవారీ లక్కీడ్రా (Hyderabad metro lucky draw) నిర్వహించారు. ఈ డ్రాలో గెలిచిన వారికి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో బహుమతులు అందించారు. ముగ్గురు విజేతలకు ఎల్ఈడీ టీవీ, వాషింగ్ మెషీన్, మైక్రో ఓవెన్లను మెట్రో అధికారులు అందించారు. భాగ్యనగర వాసులు మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. దేశంలో మిగతా మెట్రోలతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు.. కొవిడ్ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.
ఏంటీ సువర్ణ ఆఫర్...
పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం 'మెట్రో సువర్ణ ఆఫర్ 2021'ను ప్రకటించింది. 20ట్రిప్పుల ధరతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కలిగించింది. ఈ ఆఫర్ కాలంలో గరిష్ఠంగా 15రూపాయలు చెల్లించి గ్రీన్‌లైన్‌పై ఎక్కడికైనా ప్రయాణించవచ్చునని ఎల్ అండ్ టీ సంస్థ పేర్కొంది. నెలలో 20ట్రిప్పులు, ఆ పైన అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతీ నెల లక్కీ డ్రా ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ ట్రిప్పులను 45రోజులలోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఎప్పటి వరకు ఉంటుంది..
మెట్రోలో సువర్ణ ఆఫర్ అక్టోబర్ 18 2021న మొదలైంది. జనవరి 15 2022 వరకు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్ (పాత, నూతన)పై మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Hyderabad metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త .. మళ్లీ అందుబాటులోకి సువర్ణ ఆఫర్