ETV Bharat / state

మెట్రో వచ్చింది.. కష్టం తీర్చింది..! - హైదరాబాద్​ తాజా వార్తలు

మహా నగరంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రజారవాణాకు కదలిక వచ్చింది. సోమవారం ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మెట్రో రైళ్లు నడవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు సద్వినియోగం చేసుకున్నారు.  వాటిలో ప్రయాణించినవారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.  కార్యాలయాలకు, వివిధ పనులకు వెళ్లేందుకు ఇక్కట్లు తప్పనున్నాయని తెలిపారు.

metro restarted in hyderabad
మెట్రో వచ్చింది.. కష్టం తీర్చింది..!
author img

By

Published : Sep 8, 2020, 6:58 AM IST

ఉదయం స్వల్పంగా..: సోమవారం ఉదయం రైళ్లలో ప్రయాణికులు స్వల్పంగానే ప్రయాణించినా.. సాయంత్రానికి రద్దీ కాస్త పెరిగింది. నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాలకు చేరారు.

ప్రయాణికులకు సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌

అడుగడుగునా తనిఖీలు: కరోనా నేపథ్యంలో మెట్రో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అమీర్‌పేట స్టేషన్‌లో ప్రయాణికులకు సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు.

చాలారోజుల తర్వాత ఇబ్బంది లేకుండా..

నేను హైదర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. అమీర్‌పేట నుంచి జేఎన్‌టీయూ వరకు రెండేళ్లుగా మెట్రోలో వెళ్లేదానిని. ప్రస్తుతం ప్రజారవాణా లేక రోజూ ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వచ్చేది. ఇవాళ మెట్రోలో ప్రశాంతంగా వెళ్లా. -రామలక్ష్మి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని

రామలక్ష్మి

ఇదే ఆధారం: నేను ఫార్మా ఉద్యోగిని. మొన్నటివరకు సొంత వాహనాలు వాడాల్సి వచ్చింది. ఖర్చుతో పాటు ట్రాఫిక్‌ కష్టాలుండేవి. ఈరోజు మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది. - సురేశ్‌గౌడ్‌, ఫార్మా ఉద్యోగి

సురేశ్‌గౌడ్

భద్రంగా.. భయం లేకుండా :

గతంలో ఎక్కడికెళ్లాలన్నా మెట్రోనే నా ఎంపిక. నేను బ్యాంకు ఉద్యోగిని. సొంత వాహనం లేదు. ప్రస్తుతం ఈ రైళ్లు నడుస్తుండటం నాకు ఉపయుక్తంగా ఉంది.- అరుణ్‌కుమార్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.