కావలసినవి...
గోధుమ పిండి: 2 కప్పులు, మెంతికూర తురుము: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, వెల్లుల్లి ముద్ద: 2 టీస్పూన్లు, అల్లం ముద్ద: అరటీస్పూను, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, పంచదార: టేబుల్ స్పూను, ధనియాలపొడి: అర టీస్పూను, జీలకర్ర పొడి: అర టీస్పూను, పసుపు: అర టీస్పూను, జీలకర్ర: టీస్పూను, నువ్వులు: టేబుల్ స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
ఓ గిన్నెలో పిండి వేసి మిగిలినవన్నీ అందులో వేసి కలపాలి. తరవాత మూడు టేబుల్‌స్పూన్ల నూనె కూడా వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. తరవాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీల్లా వత్తుకొని పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే ఎంతో రుచికరమైన మెంతి తెప్లా రెడీ అయినట్లే.