ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ సంస్థ ఛైర్మన్ రామేశ్వర్రావు రాష్ట్ర రోడ్డు-భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మంత్రి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫెలో ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ సభ్యత్వ సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రముఖ సివిల్ ఇంజినీర్‌గా తనదైన ముద్ర వేసినందుకు గానూ తమ మెంబర్ షిప్ ఇస్తూ.. ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసినట్లు రామేశ్వర్రావు పేర్కొన్నారు. మంత్రి ఇక నుంచి ఫెలో ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ సభ్యులు, ఛార్టెడ్ ఇంజినీర్ అని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్, ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వారంలోగా నిర్ణయం...